తెలంగాణలో భీకరంగా పెరిగిన కేసులు.. నేడు ఒక్క రోజే 730 మందికి పాజిటివ్

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో నేడు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆదివారం ఏకంగా 730 కేసులు వెలుగుచూశాయి. ఏడుగురు మృతి చెందారు. హైదరాబాద్‌లో అయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా  659 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

ఇక, జనగామలో 34, మేడ్చల్‌లో 9, ఆసీఫాబాద్‌లో 3, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్గొండ, వికారాబాద్, వరంగల్, యాదాద్రిలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,802 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

ఇప్పటి వరకు 3,731 మంది డిశ్చార్జి అయ్యారు. 3,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నేడు 225 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే, ఇప్పటి వరకు 210 మంది కరోనా బారినపడి మరణించినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -