హైదరాబాద్‌లో భారీ పేలుడు.. రెండు చేతులూ కోల్పోయిన వ్యక్తి

12:04 pm, Sun, 8 September 19

హైదరాబాద్: భాగ్యనగరంలో మరోమారు భారీ పేలుడు సంభవించింది. రాజేంద్రనగర్‌లో జరిగిన ఈ పేలుడులో ఓ వ్యక్తి రెండు చేతులూ కోల్పోయాడు. రాజేంద్రనగర్ పిల్లర్ నంబరు 173 వద్ద ఈ పేలుడు జరిగింది.

చెత్తకుప్పలో దొరికిన బాక్స్‌ను తెరిచేందుకు ప్రయత్నించగా భారీ శబ్దంతో అది పేలిపోయింది. బాక్స్ తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి రెండు చేతులు తెగి పది మీటర్ల దూరంలో పడ్డాయి.

బాక్స్ తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తిని బిచ్చగాడిగా అనుమానిస్తున్నారు. రోడ్డుపైన, చెత్త కుప్పల నుంచి సేకరించిన వస్తువులను తన బ్యాగులో వేసుకుని ఫుట్‌పాత్‌పై కూర్చుని వాటిని పరిశీలిస్తుండగా అందులో బాక్స్ దొరికింది.

దానిని తెరిచే ప్రయత్నంలో భారీ పేలడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆధారాలు సేకరిస్తున్నాయి.

ఆ బాక్స్‌ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.