హైదరాబాద్‌లో రూ. 81 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

- Advertisement -

హైదరాబాద్: ‌నగరంలో మరోమారు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఏకంగా రూ. 81 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి ముంబైకి వీటిని తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు.

- Advertisement -

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో రూ. 28.52 కోట్ల విలువైన 142.6 కిలోల మెఫెడ్రన్, రూ. 3.1 కోట్ల విలువైన 31 కిలోల ఎపిడ్రిన్‌ ఉన్నాయి.

అలాగే, ఓ కంపెనీలో మెఫెడ్రిన్ తయారీకి సిద్ధంగా ఉంచిన 250 కిలోల ముడిసరుకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 50 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

డీఆర్ఐ పోలీసులు గత మూడు రోజులుగా హైదరాబాద్, ముంబైలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి రూ. 45 లక్షల భారత కరెన్సీ, అమెరికన్ డాలర్లు, ఈయూఆర్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -