షాకింగ్: ‘‘ప్రణయ్ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోంది.. నీకోసమే ఎదురు చూస్తోంది…’’: దంపతుల అనుమానాస్పద ప్రవర్తన

- Advertisement -

hyderabad couple

మిర్యాలగూడ: ఇటీవల నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.  అయితే ‘‘పెరుమాళ్ల ప్రణయ్ ఆత్మ ఇంకా ఇక్కడే వుంది… ప్రణయ్ ఆత్మ తమకు కలలో కనిపిస్తోంది..’’ అంటూ ప్రణయ్ ఇంటికి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన దంపతులను మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

ప్రణయ్ తండ్రి బాలస్వామి, ఇంకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన వివరాలు… హైదరాబాద్ పటాన్ చెరువుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు. వీరిద్దరూ ఆదివారం తమ పిల్లలతో సహా మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికండలో ఉన్న ప్రణయ్ ఇంటికి వచ్చారు. తాము కూడా షెడ్యూల్డ్ కులానికి చెందిన వారమే అని పరిచయం చేసుకున్నారు. అంతేకాదు,  ప్రణయ్ ఆత్మ తమకు కలలో కనిపిస్తోందని చెప్పి ప్రార్థన చేశారు.

ఆనంతరం ప్రణయ్ తల్లిదండ్రులు, ప్రణయ్, మారుతీరావులు గత జన్మలో శత్రవులనీ, గత జన్మలోని కోపాన్ని ఈ జన్మలో మారుతీరావు ఇలా  తీర్చుకున్నాడని వారు ప్రణయ్ తల్లిదండ్రులకు చెప్పారు.  అంతే కాకుండా.. ప్రణయ్ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోందని, ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందని, మీతో కూడా మాట్లాడిస్తామని వారితో చెప్పడంతో అనుమానం వచ్చిన ప్రణయ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘‘నీ కోసం ప్రణయ్ ఆత్మ ఎదురు చూస్తోంది..’’

ప్రణయ్ భార్య అమృతతో ఒంటరిగా మాట్లాడాలని నాగారావు, సత్యప్రియ దంపతులు చెప్పగా ప్రణయ్ తల్లిదండ్రులు తొలుత అందుకు ఒప్పుకోలేదు. అయితే ప్రణయ్ గురించిన కొన్నివిషయాలు అ‌మృతకు మాత్రమే చెప్పాలని వారు చెప్పడంతో తర్జనభర్జన పడిన వారు చివరికి అమృతతో ఏకాంతంగా మాట్లాడటానికి ఒప్పుకున్నారు.

అనంతరం నాగారావు, సత్యప్రియ ఇద్దరూ అమృతతో మాట్లాడుతూ ‘‘ప్రణయ్ ఆత్మ నీకోసం ఏడుస్తోంది… నీ కోసం ప్రణయ్ ఎదురుచూస్తున్నాడు, వచ్చే జన్మలో కూడా నీతోనే కలిసి ఉండాలని అతడు కోరుకుంటున్నాడు,  ప్రణయ్‌ విగ్రహం పెట్టొద్దు. విగ్రహం పెడితే ప్రణయ్ ఆత్మ ఆ విగ్రహంలోనే ఉండిపోతుంది..’’ అంటూ చెప్పకొచ్చారు.. అయితే ఈ దంపతుల తీరు, వారి ప్రవర్తన‌పై అనుమానం కలిగిన అమృత వెంటనే డీఎస్పీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసింది.

దీంతో మిర్యాలగూడ వన్‌ టౌన్ సీఐ నాగరాజు ప్రణయ్ ఇంటికి చేరుకుని నాగారావు, సత్యప్రియను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి గురించిన వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. నాగరావు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దీంతో అప్రమప్తమైన పోలీసులు ప్రణయ్‌ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అసలు ఈ దంపతులు  ఎందుకు మిర్యాలగూడ వచ్చారు? వారిని  ఎవరైనా పంపించారా? అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు డీఎస్సీ శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -