బంజారాహిల్స్‌లో రూ.కోట్ల వజ్రాభరణాలు మాయం.. బీహార్ పశువుల పాకలో ప్రత్యక్షం!

1:10 pm, Thu, 13 February 20

హైదరాబాద్: గతేడాది డిసెంబరు 8న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన చోరీ సంచలనం రేపింది. ఓ వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలను దోచేసిన బీహార్‌ ముఠా పరారైంది.

ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం రంగంలోకి దిగారు. దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్టు హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

చోరీ చేసిన వజ్రాభరణాలతో బీహార్‌లోని మధుబనికి పారిపోయిన నిందితులు నగలను అమ్మేశారని, వజ్రాల నగలను మాత్రం ఓ ఇంట్లోని పశువుల కొట్టంలో పాతిపెట్టారని తెలిపారు. మరికొంత సొత్తును గోడలో దాచిపెట్టారని వివరించారు. 

చదవండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం