విషాదం: పరీక్ష రాస్తూ ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి

4:15 pm, Sat, 2 March 19
student

హైదరాబాద్‌: నగరంలోని ఓ ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం పరీక్ష రాస్తూ ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందాడు.

సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ సమీపంలోని శ్రీచైతన్య కళాళాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాస్తూ గోపీరాజ్‌ అనే విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు.

ఎల్లారెడ్డిగూడకు చెందిన వెంకట్రావ్‌ కుమారుడు గోపిరాజ్‌ అమీర్‌పేట్‌లోని ఓ కళాశాలలో చదువుతున్నాడు. విషయం తెలిసి విద్యార్థి తండ్రి, సోదరుడు కళాళాలకు చేరుకున్నారు.

విగతజీవిగా పడి ఉన్న గోపీరాజ్‌ను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, గోపీరాజ్ గుండెపోటు రావడంతోను మృతి చెందినట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.