భాగ్యనగర వాసులను భయపెడుతున్న కరోనా మహమ్మారి.. రోడ్డుపైకి వచ్చేందుకు జంకుతున్న జనం!

- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలో మళ్లీ లాక్‌డౌన్ తొలినాటి రోజులు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టేందుకు ప్రజలు వణుకుతున్నారు.

దీనికి తోడు హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించబోతున్నారన్న ప్రచారంతో నగరంలోని ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో రోడ్లన్నీ బోసిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

హైదరాబాద్‌లో గత 15 రోజులుగా రోజుకు సగటున 1000 వరకు కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత పెరుగుతుండడంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఫలితంగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. లాక్‌డౌన్ విధిస్తారన్న ఊహాగానాలతో ఏపీ వాళ్లు ఇప్పటికీ స్వగ్రామాలకు తరలుతుండడంతో చాలా ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా బోసిపోయాయి. ఎక్కడో ఒకటీ అరా తప్ప వాహనాల జాడ కనిపించడం లేదు.

- Advertisement -