చినజీయర్ ఆశ్రమంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు, ప్రచార పర్వానికి ముందు దీవెనలు పొందిన కేసీఆర్…

cm-kcr-divya-saketam-visit
- Advertisement -

cm-kcr-divya-saketam-visitహైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని శ్రీరామ నగరంలో ఉన్న దివ్య సాకేతాన్ని సందర్శించి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం చిన జీయర్ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమంలో నక్షత్ర మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమంలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్త‌ృతంగా పర్యటించబోతున్నారు. ఎన్నికల సమయంలో చినజీయర్ స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందడం టీఆర్ఎస్ అధినేతకు అలవాటు.

- Advertisement -

ప్రత్యేక పూజలు నిర్వహించి…

అందులో భాగంగానే శనివారం కేసీఆర్ దివ్య సాకేతాన్ని సందర్శించి తన గురువుగా భావించే చినజీయర్ స్వామిని కలిసి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయన ఆశీస్సులు పొందారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ కాసేపు ఏకాంతంగా చినజీయర్ స్వామితో చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి బయటికి వచ్చి అక్కడున్నవారితో ముచ్చటించారు.

జాతకాలు, వాస్తులు, దోషాలను ఎక్కువగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసమే చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారని, ఈ సందర్భంగా అక్కడ జరిగిన యాగంలో కూడా పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. చినజీయర్ స్వామి ఆశీర్వాద బలంతో ఇక కేసీఆర్ తమ పార్టీ ప్రచారాన్ని కూడా పరుగులెత్తించడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

cm-kcr-divya-saketam-visit-02

cm-kcr-divya-saketam-visit-04

cm-kcr-divya-saketam-visit-05

cm-kcr-divya-saketam-visit-06

cm-kcr-divya-saketam-visit-07

cm-kcr-divya-saketam-visit-08

cm-kcr-divya-saketam-visit-09

- Advertisement -