కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ ట్రైలర్!

10:19 am, Thu, 14 March 19
KCR's biopic 'Udyama Simham' trailer!, Newsxpressonline

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఉద్యమ సింహం’ ట్రయిలర్ విడుదైంది. నటరాజన్, పీఆర్ విటల్ బాబు, సూర్యలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి అల్లూరి కృష్ణం రాజు దర్శకత్వం వహించగా, దీలీప్ బండారి సంగీతాన్ని సమకూర్చారు.

ఆకట్టుకుంటున్న డైలాగులు..

చిత్రాన్ని పద్మనాయకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మించారు. మార్చి 29న విడుదల కానున్న ఈ సినిమాలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానాన్ని చూపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన పడ్డ తమన, ఎదుర్కొన్న అవమానాలు, చేసిన ఆమరణ దీక్ష తదితరాంశాలను చిత్రంలో ప్రస్తావించినట్టు ట్రయిలర్ చెబుతోంది.

“కత్తి పట్టకుండా యుద్ధం చేయనీకి పోతుండాం. రాష్ట్రం వచ్చుడో… నేను చచ్చుడో”, “రాష్ట్రం ఇస్తరా? చస్తరా?” వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ట్రయిలర్ ను మీరూ చూడవచ్చు.