జగన్ విషయం ఏపీ ప్రజలే చూసుకుంటారు: కేటీఆర్

6:44 pm, Sun, 28 April 19
ktr

హైదరాబాద్: తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన తనకు కాస్త సమయం దొరికితే #AskKtr పేరిట ట్విట్టర్‌లో అభిమానులకు అందుబాటులో ఉంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలన్నింటికి ఆసక్తికర సమాధానాలు ఇస్తుంటారు.

ఈ నేపథ్యంలో ఆయనను అభిమానులు రాజకీయాలపై ప్రశ్నలు అడిగారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ సరిపోతాడా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తన అభిప్రాయంతో పని లేదని, ఆంధ్రా ప్రజలు దానిని నిర్ణయిస్తారన్నారు.

తనకు అసలు ఏపీ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని కేటీఆర్ తెలిపారు. 2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 2024 చాలా దూరంలో ఉందని సమాధానమిచ్చారు.