మానవ మృగం: వరుసకు కుమార్తె అయిన యువతిపై రోజులతరబడి…

Bihar-shelter-home-rapes
- Advertisement -

Bihar-shelter-home-rapes

నెల్లూరు: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మనవ మృగం వరుసకు కుమార్తె అయిన యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుంకుది. నెల్లూరు జిల్లాలో కావలికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయి కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తోంది. ఆమె కొంత కాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

శ్రీనివాస్‌ యుక్తవయస్సుకు వచ్చిన ఆమె కుమార్తెపై కూడా కన్నేశాడు. ఈ క్రమంలో  ఆ యువతిని లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడి,  గర్బవతిని చేశాడు. అంతేకాదు, బాధితురాలికి కొన్ని మాత్రలు ఇచ్చి గర్భం పోయేలా చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ యువతితో పాటు ఆమె తల్లినీ చంపేస్తానని బెదిరించాడు.  దీంతో ఆ యువతి బెదిరిపోయింది.

అదే అదనుగా శ్రీనివాస్ ఆ తరువాత కూడా తన కామవాంఛను తీర్చుకోసాగాడు. అతడి వికృత చేష్టలతో విసిగిపోయి బాధితురాలి చివరికి తన తల్లితో జరిగిన ఘోరమంతా చెప్పేసింది. దీంతో యువతి తల్లి నిలదీయటంతో ఆగ్రహం చెందిన శ్రీనివాస్‌ వారిద్దరిని ఇంట్లోనే నిర్భందించాడు.

ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం అతని నిర్బంధం నుండి తప్పించున్న తల్లీకూతుళ్లు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

- Advertisement -