అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నెక్లెస్ రోడ్.. హిందువులే టార్గెట్‌గా దాడులు: ఎమ్మెల్యే రాజాసింగ్

4:16 pm, Sat, 15 June 19

హైదరాబాద్: పర్యాటకులని ఆకర్షించే హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ విమర్శించారు. నెక్లెస్ రోడ్డులో జరిగిన దాడిలో గాయపడిన సాయి సాగర్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో… రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సాయి సాగర్ పై దాడి చేసిన మొబిన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ అని తెలిపారు. మొబిన్ పై 12 కేసులు ఉన్నాయని చెప్పారు. నెక్లెస్ రోడ్డుపై మొబిన్ ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే సాగర్ నిలదీశాడని… ఆ కారణంతోనే దాడికి పాల్పడ్డాడని తెలిపారు.

సాగర్ పై మొబిన్ రాయితో దాడి చేశాడని, దీంతో అతను కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ఇక హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నెక్లెస్ రోడ్డులో భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇదిలా ఉంటే చనిపోయిన సాయి సాగర్ కు 10 రోజుల క్రితమే పెళ్లి అయ్యింది. సాయి మృతితో అతని ఇంట్లో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ముబీన్ ను కఠినంగా శిక్షించాలని సాయి బంధువులు, ఫ్రెండ్స్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

చదవండి: టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లో కోత.. వివరణ ఇచ్చిన ఏపీ పోలీసులు!