జైలునుండి విడుదలైన మారుతిరావు! భద్రత పెంచమని కోరిన అమృత!

8:50 am, Sun, 28 April 19
maruthi-rao-amrutha

వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఈ ఉదయం వరంగల్ జైలు నుంచి విడుదల అయ్యారు.

ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో హైకోర్టు నిందితులందరికీ శనివారం నాడు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందడం ఆలస్యం కావడంతో మారుతీరావు విడుదల ఒక రోజు ఆలస్యమైంది.

నిన్న రాత్రి బెయిల్ పత్రాలు జైలుకు అందడంతో, ఈ ఉదయం ఆయన విడుదలయ్యారు. మారుతీరావుతో పాటు శ్రవణ్‌కుమార్, కరీంలు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా, మారుతీరావుతో తనకు ప్రాణాపాయం ఉందని, భద్రత పెంచాలని అమృత పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.