ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లు కరోనా! ఇప్పటికే ఇద్దరు గన్‌మెన్లూ చికిత్సలో…

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లు ఈ వైరస్ బారిన పడ్డారు. 

ఇప్పటికే రాజాసింగ్ గన్‌మెన్లు ఇద్దరూ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మళ్లీ ఇప్పుడు ఆయన డ్రైవర్లు ఇద్దరికీ కరోనా సోకింది. 

- Advertisement -

ఒకవేళ తనకూ కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానంతో ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. 

ప్రస్తుతం రాజాసింగ్ రోజులో అధిక భాగం ఇంట్లోనే గడుపుతున్నారు. రోజుకంటే ఎక్కువ సేపు వ్యాయామం చేస్తున్నానని పేర్కొంటూ ఆయన ఇటీవల ఓ వీడియోను కూడా విడుదల చేశారు. 

తన గన్‌మెన్‌కు కరోనా సోకినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ వీడియోలో స్వయంగా ప్రకటించారు. ఆయన గన్‌మెన్లు ఇద్దరిలో మొదట ఒకరికే కరోనా సోకింది. ఆ తరువాత రెండో గన్‌మాన్ కూడా వైరస్ బారిన పడ్డారు.

తాజాగా ఆయన వాహనానికి డ్రైవర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులూ కరోనా బారిన పడడం గమనార్హం. 

మరోవైపు తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి మొత్తం పాజిటివ్ కేసులు 10,444కు చేరగా.. బుధవారం ఒక్కరోజే 891 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 719 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు కరోనా కాటుకు తెలంగాణ వ్యాప్తంగా 225 మంది మరణించారు. 

చదవండి: కరోనా చికిత్సకు ‘పతంజలి’ ఆయుర్వేద మందు.. వారం రోజుల్లో అందుబాటులోకి…
- Advertisement -