అందుకే చేరా: కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి నామా, ఖమ్మం నుంచి పోటీ!

3:22 pm, Thu, 21 March 19
Nama Nageswara rao Latest News, Telangana Political Latest Updates News, KTR Latest News, Newsxpressonline

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీ కండువా కప్పిన కేటీఆర్.. నామను సాదరంగా ఆహ్వానించారు.

నామాతో పాటు పెద్ద ఎత్తున టీడీపీకి చెందిన నేతలు కూడా గులాబీ పార్టీ గూటికి చేరారు. టీఆర్ఎస్‌లో చేరిన వారిలో శోభారాణి, అమర్నాథ్‌బాబు, బ్రహ్మయ్య, అట్లూరి రమాదేవి, అనూషారాం, బొట్ల శ్రీనివాస్, శరత్ బాబు, గొడ్డేటి మాధవరావు, చిత్తారు సింహాద్రి యాదవ్, గొల్లపూడి హరికృష్ణ.. నేతలందరికీ టీఆర్ఎస్ కండువాలు కప్పిన కేటీఆర్.. పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి నామా నాగేశ్వరరావును టీఆర్ఎస్ అధినేత ఇప్పటికే ఖరారు చేశారని తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ తరపున ఆయన బరిలో దిగే అవకాశం ఉంది.

అందుకే టీఆర్ఎస్ చేరా..

టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం నామా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌లో చేరినట్టు వెల్లడించారు. తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నామా నాగేశ్వరరావు తెలిపారు.