తెలంగాణలో ఈరోజు నమోదైన కరోనా కేసులు ఎన్నంటే..

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా 9 కరోనా మరణాలు సంభవించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ బులెటిన్ విడుదలయింది.

ఎప్పటిలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 133 కేసులు నమోదుకాగా, ఇక రాష్ట్రంలోని మరో 13 జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి.

- Advertisement -

ఆరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదుకాగా, మిగిలిన జిల్లాల్లో అంతకంటే ఎక్కువ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 4484కు చేరుకుంది. అదేవిధంగా మరణాల సంఖ్య 174కు పెరిగింది. కాగా, రాష్ట్రంలో మొత్తమ్మీద 2032 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -