అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు.. పెంపుడు కుక్కలను ఉసిగొల్పిన పీవీపీ

PVP to join YSRC, get Vijayawada LS ticket! Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: ఓ కేసులో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత వరప్రసాద్ (పీవీపీ) తన పెంపుడు శునకాలను ఉసిగొల్పడం సంచలనం సృష్టించింది.

దీంతో విధులకు ఆటంకం కలిగించారంటూ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో పీవీపీపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 14లో జరిగిన గొడవ కేసులో అరెస్ట్ చేయడానికి పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లారు. తన ఇంట్లోకి వస్తున్న పోలీసులను చూసిన పీవీపీ వారిపైకి కుక్కలను వదిలారు.

- Advertisement -

తన నుంచి విల్లాను కొనుగోలు చేసిన వ్యాపారిపై పీవీపీ ఇటీవల దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాదాపు 20 మంది రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి ఆయన ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. అంతేకాదు, అతడిని చంపేస్తానని బెదిరించారు.

దీంతో బెదిరిపోయిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పీవీపీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఆ తర్వాత పీవీపీని వదిలిపెట్టారు.

అయితే, ఇంట్లోనే ఉంటున్నప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా వారిపైకి శునకాలను వదిలారు.

- Advertisement -