24 గంటలకు రూ. 1.15 లక్షల బిల్లు.. ప్రశ్నించినందుకు ఫీవర్ ఆసుపత్రి డీఎంను నిర్బంధించిన ప్రైవేటు ఆసుపత్రి

- Advertisement -

హైదరాబాద్: కరోనా లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి డీఎంవో సుల్తానాను ఆసుపత్రి యాజమాన్యం నిర్బంధించింది. 24 గంటల చికిత్సకు రూ. 1.15 లక్షల బిల్లు వేస్తే.. అంత ఎందుకని ప్రశ్నించినందుకు ఈ దారుణానికి పాల్పడింది.

 

- Advertisement -

సెల్ఫీ వీడియో ద్వారా సుల్తానా ఈ విషయాన్ని పంచుకోవడంతో సంచలనమైంది. కరోనా లక్షణాలతో తాను చాదర్‌ఘాట్‌లోని తుంబై ఆసుపత్రిలో చేరానని, 24 గంటలకు రూ.1.15 లక్షల బిల్లు వేశారని ఆమె ఆ సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. అంత బిల్లు ఎలా వేస్తారని ప్రశ్నించినందుకు సిబ్బంది తనను నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -