నేడే రాహుల్‌ గాంధీ తెలంగాణ ఎన్నికల భేరి.. అధ్యక్షుడి వాక్పటిమపైనే కాంగ్రెస్ శ్రేణుల గురి

rahulgandhi1
- Advertisement -

rahul gandhi

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం మొదలు పెట్టానున్నారు. తెలంగాణలో రాహుల్‌, సోనియా సభలతో ప్రచారానికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరింత ఉత్సహం వస్తుందని భావిస్తున్నతెలంగాణ కాంగ్రెస్‌ అందుకు అనుగుణంగా తమ కార్యాచరణ రూపొందించింది. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కూడా తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. అయితే ఆమె సభలు రెండుకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది.

- Advertisement -

దీంతో రాహుల్‌తోనే పదికి మించి సభల నిర్వహణకు నేతలు ప్రణాళిక రూపొందిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ సభకు సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, సభకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అగ్రనేత తొలి సభలు కావడంతో…

తెలంగాణ ఎన్నికల ప్రకటన తర్వాత జరుగుతున్న కాంగ్రెస్ అగ్రనేత తొలి సభలు కావడంతో కాంగ్రెస్‌ నేతలు కామారెడ్డి,  భైంసా సభలపై ఎక్కువ దృష్టి పెట్టారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలను దృష్టిలో ఉంచుకుని ఈ సభలను ప్లాన్ చేసి, వీటిని విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక కృషి చేస్తున్నారు. గత వారం రోజులుగా కాంగ్రెస్ నేతలు ఈ సభల ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.

తెలంగాణలో ఈ ఎన్నికలలో అన్ని వర్గాల ఓట్లతో పాటు మైనార్టీల ఓట్లపై కాంగ్రెస్‌ విశ్వాసంతో ఉంది. పలు నియోజకవర్గాల్లో మైనార్టీల ఓట్లు కీలకం కావడంతో దీనికి అనుగుణంగా ప్రచార కార్యాచరణ రూపొందిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌పైనే ప్రత్యేక గురి …. 

తమ పార్టీ హామీలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను రాహుల్‌ గాంధీ ప్రసంగాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు తెలిపారు.  టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యనేతలు ముందుగా రాహుల్‌ గాంధీని కలిసి తన సభల్లో ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అంశాల గురించి వివరిస్తారు.

టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చని హామీలను, ప్రధానంగా రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం, ముస్లిం మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల అంశం,  దళితులు, గిరిజనులకు భూ పంపిణీలో వైఫల్యాలను ముఖ్యంగా ప్రస్తావించనున్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా తమ అస్త్రాలను సంధించనున్నారు.

సభ సమయంలో కొద్దిగా మార్పులు….

గతంలో నిర్ణయించిన ప్రకారమైతే రాహుల్ గాంధీ మొదట హైదరాబాద్‌కు వచ్చి, ఆ తర్వాత భైంసా, కామారెడ్డి సభలకు వెళ్లాల్సి ఉంది. అయితే ఇందులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. రాహుల్‌ శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారు.

అక్కడి నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు భైంసా చేరుకుంటారు. 12.30 నుంచి 1.30 గంటల వరకు భైంసా సభలో పాల్గొంటారు. అనంతరం కామారెడ్డి చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటలకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు వస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య చార్మినార్‌ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి వెళ్తారు.

- Advertisement -