టీవీ9 సీఈ‌వో పదవి నుంచి తొలగింపు వార్తలపై స్పందించిన రవి ప్రకాశ్…

- Advertisement -

హైదరాబాద్: టీవీ9 సీఈవో పదవి నుంచి తప్పించారన్న ప్రచారంపై ఆ ఛానల్ సీఈవో రవిప్రకాశ్ స్పందించారు. తనపై ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గురువారం హఠాత్తుగా టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమైన ఆయన.. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరూ తనను అరెస్ట్ చేయడం లేదని స్పష్టం చేశారు.

ఇక ఎన్‌సి‌ఎల్‌టి  కేసు కోర్టులో ఉందని..మే 16 విచారణ జరగుతుందని, దాని ఆధారంగా తనపై తప్పుడు కేసులు బనాయించేందుకు కొందరు కుట్రలు చేశారని తెలిపారు. అవన్నీ నిలబడబోవని తేల్చిచెప్పారు. సామాజిక సేవ కోసం టీవీ9 జర్నలిస్టులు పనిచేస్తున్నారన్న రవిప్రకాశ్…పుకార్లను నమ్మవద్దని సూచించారు.

చదవండి: అధినేత హామీతో అలకవీడిన బాబాయ్!

అసలు వివాదం ఏంటంటే?

కాగా, గత కొన్ని రోజులుగా టీవీ9-అలందా మీడియా సంస్థల మధ్య  వివాదం నడుస్తోంది. ఈ టీవీ9లో మెజార్టీ వాటా షేర్లను అలందా మీడియా వద్ద ఉన్నాయి.

ఈ క్రమంలో అలందా మీడియా కార్యదర్శి కౌశిక్ రావు సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద పోలీసులకు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను టీవీ9 సీఈఓ పదవినుండి తొలగించారని వార్తలు వచ్చాయి.

చదవండిటీవీ9 సీఈవో రవిప్రకాష్‌ కోసం పోలీసుల గాలింపు! సీఈవో పదవి నుండి తొలగింపు!?
- Advertisement -