డిప్రెషన్‌తో రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్య.. నిజామాబాద్‌లో ఘటన

- Advertisement -

అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉద్యోగానికి వెళ్తున్నానన్నాడు. అర్దరాత్రి ఉద్యోగం ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే.. ‘ప్రభుత్వ ఉద్యోగిని కదా! అంతే’అని చెప్పి వెళ్ళిపోయాడు.

అయితే తెల్లవారేసరికి స్థానిక చెరువులో విగతజీవిగా కనిపించాడు. ఈ పరిణామంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

గ్రామ రెవెన్యూ కార్యదర్శి ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొడిచర్ల గ్రామ రెవెన్యూ కార్యదర్శి కృష్ణారెడ్డి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రుద్రూర్ మండల కేంద్రంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే.. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి బయలు దేరాడు.

అలా వెళ్లిన కృష్ణా రెడ్డి.. రుద్రూర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం చెరువులో అతని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్య వివరాలను మృతుని కుటుంబ సభ్యులకు చేరవేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

జీవితంపై విరక్తి చెందడం వల్లే ఆత్మహత్యకు పాల్పడటానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

- Advertisement -