గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలం.. సూపరింటెండెంట్ కార్యాలయంలో ముగ్గురికి సోకిన వైరస్

- Advertisement -

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా మహమ్మారి బారినపడ్డారు. సూపరింటెండెంట్ పీఏ, అసిస్టెంట్ పీఏ, నర్సుకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మరోవైపు, నేడు ఆదిలాబాద్‌లోని రిమ్స్ నర్సుకు కూడా కరోనా సోకినట్టు తేలింది.

విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆమె నివాసముంటున్న కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇంకోవైపు, హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడుతున్నారు. పేట్లబురుజు హాస్పిటల్‌లో 30 మందికి పైగా కోవిడ్ బారినపడగా, ఉస్మానియా డెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కూడా కరోనా సోకింది. ఇటీవల ఖైరతాబాద్‌లో ఓ వైద్యుడు కోవిడ్ బారినపడి మృతి చెందాడు.
 

- Advertisement -
- Advertisement -