ఎట్టకేలకు కేబినెట్‌ను విస్తరించనున్న కేసీఆర్.. హరీశ్, కేటీఆర్ ఇన్.. ఈటల అవుట్?

6:45 am, Sun, 8 September 19

హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు విస్తరించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారం చేయబోయే కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాను నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్‌లకు మంత్రి వర్గంలో చోటు లభించినట్టు తెలుస్తోంది.

అలాగే, గులాబీ జెండాకు మేమే ఓనర్లమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశం ఉంది. ఆయనతోపాటు మరొకరి పదవికి కూడా గండం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక, రంగారెడ్డి జిల్లాపై సబితకు మంచి పట్టు ఉండడంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమెకు, గిరిజన మహిళ కోటాలో సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ చైర్మన్‌గా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని, శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.