కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల చెక్కులను అందించిన కేసీఆర్

- Advertisement -

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. నేడు రోడ్డు మార్గంలో కేసీఆర్ సూర్యాపేట వెళ్లారు. చైనా సైనికుల దాడిలో అమ‌రుడైన సంతోష్ బాబు చిత్రాప‌టానికి నివాళి అర్పించారు. అనంతరం సంతోష్ బాబు కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడారు.

అతడి కుమారుడు, కుమార్తెను ప‌లుక‌రించారు. సంతోష్ భార్య సంతోషి, త‌ల్లితండ్రుల‌తోనూ సీఎం కేసీఆర్ కాసేపు ముచ్చ‌టించారు. సంతోష్ భార్య సంతోషితో మాట్లాడిన కేసీఆర్ ఆమెకు గ్రూప్-1 జాబ్ అపాయింట్ లెటర్‌‌ను అంద‌జేశారు. ఆమె కుటుంబానికి 5 కోట్ల‌ రూపాయ‌ల చెక్కులను అంద‌జేశారు.

- Advertisement -

వీటిలో తల్లిదండ్రులకు రూ. కోటి, సంతోష్ భార్యకు రూ. 4కోట్ల చెక్కులు ఉన్నాయి. షేక్‌పేట‌లో 711 గ‌జాల ఇంటి స్థ‌లానికి సంబంధించిన ప‌త్రాల‌ను కూడా సీఎం కేసీఆర్‌ సంతోష్ భార్యకు అంద‌జేశారు. ముఖ్యమంత్రి వెంట విద్యుత్‌శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, రోడ్లు, భ‌వ‌నాలు, గృహ‌నిర్మాణ‌, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల‌శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌, రాష్ట్ర సీఎస్‌ సోమేశ్ కుమార్ ఉన్నారు.

- Advertisement -