గాల్వన్ అమరుడు సంతోష్‌బాబు కుటుంబానికి భారీ సాయం ప్రకటించిన కేసీఆర్

telangana-cm-kcr-extends-lock-down-till-may-29
- Advertisement -

హైదరాబాద్: గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబానికి రూ. 5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

అంతేకాదు, తాను స్వయంగా వెళ్లి ఈ సాయాన్ని అందిస్తానని పేర్కొన్నారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి ద్వారా అందిస్తామన్నారు. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవడం ద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలని కేసీఆర్ అన్నారు.

- Advertisement -

దేశమంతా వారి వెంట ఉందనే సందేశం అందించాలన్నారు. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం తమ వెంట ఉందన్న నమ్మకం కలుగుతుందన్నారు.

- Advertisement -