ముందస్తు అసెంబ్లీ రద్దుపై.. సుప్రీంకు వెళ్ళిన డీకే అరుణ

dk-aruna (1)
- Advertisement -

dk-aruna (1)

హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ రద్దుపై దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడాన్ని హైకోర్టు తిరస్కరించడంతో.. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ సుప్రీంకోర్టుకు వెళ్లారు.  ఈ విషయానికి సంబంధించి డీకే అరుణ వేసిన  స్పెషల్ లీవ్ పిటిషన్‌‌పై ఈ నెల 22న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

- Advertisement -

చదవండి: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట: ముందస్తు ఎన్నికలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత…

అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ డీకే అరుణతోపాటు శశాంక్ రెడ్డి కూడా  హైకోర్టులో వేసిన వ్యాజ్యాలని చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీకే అరుణ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆర్టికల్‌ 174 ప్రకారం, శాశన సభ్యుల ప్రమేయం లేకుండా సీఎం అప్రజాస్వామికంగా సభను రద్దు చేస్తుంటే అడ్డుకునే అధికారం గవర్నర్‌కు ఉందని తెలిపారు.

శాసనసభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకు అసెంబ్లీ రద్దుకు ముందు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి సభను సమావేశపరిచే అధికారం గవర్నర్‌కు ఉన్నాకానీ.. ఆయన ఆ పని చేయలేదని పిటిషనర్‌ ఆరోపించారు.  రద్దుకు ముందు అసెంబ్లీని సమావేశపరిస్తే.. గవర్నర్‌ చర్య ప్రజాస్వామ్యయుతంగా ఉండేదని డీకే అరుణ అభిప్రాయపడ్డారు.

- Advertisement -