స్వచ్చందంగా బయటకు రండి.. లేకపోతే దేశద్రోహులుగా మిగిలిపోతారు: విజయశాంతి

10:11 pm, Tue, 31 March 20
vijaya-santhi

హైదరాబాద్ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదు సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన వారిలో చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది.

సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటి వరకూ గుర్తించిన వాళ్లు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? వారు ఇంకెంతమందిని కలిశారు?అన్న విషయాలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి.

‘‘ఇప్పటికైనా బయటపడండి..’’

ఈ క్రమంలో నిజాముద్దీన్‌కు వెళ్ళొచ్చిన వారికి కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి పలు సూచనలు చేశారు. మసీదు సమావేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వెంటనే తమ వివరాలను తక్షణమే స్వచ్ఛందంగా ప్రకటించాలని సూచించారు.

చదవండి: స్పందించిన కేటీఆర్.. గంటల వ్యవధిలోనే ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు!

సమస్య తీవ్రత, కోట్లాది ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా, ఈ సమయంలో వివరాలతో ముందుకు రాని అందరినీ దేశద్రోహులుగా ప్రకటించి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించినవారు ఈ దేశానికి నిజంగా ఎంతో మేలు చేసినవారవుతారని వ్యాఖ్యానించిన ఆమె.. యావత్ సమాజం పడుతున్న ఆందోళనను నివృత్తి చెయ్యటానికిగాను, వారికున్న అవకాశాన్ని ఇప్పటికైనా ఉపయోగించుకుని, ఏ విధమైన కుట్ర కోణంలోనూ తమ భాగస్వామ్యం లేదని నిరూపించుకోవాలని తన ఫేస్‌బుక్ వేదికగా విజయశాంతి కోరారు.