ఇంటర్ ఇష్యూ: కేసీఆర్‌పై తిట్ల వర్షం కురిపిస్తున్న కాంగ్రెస్ నేతలు

- Advertisement -

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా సీఎం కేసీఆర్‌పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలరోజులకి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏకిపారేసే అవకాశం రావడంతో కాంగ్రెస్ నాయకులు ఎవరు తగ్గట్లేదు. దొరికిందో సందు అన్నట్లుగా ఇంటర్ ఫలితాల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.

రోజుకొకరు ప్రెస్ మీట్లు పెడుతూ…కేసీఆర్‌, కేటీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ….కేసీఆర్ వైఫల్యంతోనే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

అసలు కేసీఆర్‌ది విధానాల సర్కార్‌ కాదని నినాదాల సర్కార్‌ అని, విద్యార్థుల మరణాలపై కేసీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా దారుణమని వ్యాఖ్యానించారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సీఎంపై కోమటిరెడ్డి ఫైర్..

ఇక మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే….కేసీఆర్, జగదీష్ రెడ్డిలని దారుణంగా తిట్టారు. విద్యార్ధుల ఆత్మహత్యలకి ప్రభుత్వమే భాద్యత వహించాలని అన్నారు. అసలు ఇంటర్ పరీక్షలనే సరిగా నిర్వహించలేని సీఎం…పీఎం ఎలా అవుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలని పలకరించేందుకు కూడా కేసీఆర్‌కి టైమ్ లేదని, విద్యార్ధుల ఉసురు తగిలి కేసీఆర్ నాశనమవుతారని అన్నారు. అయిన కేసీఆర్‌కి ఎమ్మెల్యేల కొనుగోలు మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర పాలన మీద లేదన్నారు.

జగదీష్ ఓ దౌర్భాగ్యుడు..

విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఒక అసమర్ధుడు, దౌర్భాగ్యుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగదీష్ మా నల్గొండ జిల్లా వాడు కావడం పెద్ద దురదృష్టమని చెప్పారు. ఇక గ్లోబరీనా సంస్థపై మర్డర్‌ కేస్‌ పెట్టాలని, అవినీతి అధికారి అశోక్‌ను సస్పెండ్‌ చేయాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు.

చదవండి:వీడొక ‘సైకో’: ముందు ఊపిరాడకుండా చేసి.. ఆపైన హత్యాచారాలు!

 

- Advertisement -