తెలంగాణలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 50 వేలకు చేరువలో కేసులు

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,554 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది.

మొత్తం 37,666 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 76.5 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 9 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 438కి పెరిగింది.

- Advertisement -

గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 842 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. నేడు 1,281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం 11,155 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 2,93,077 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -