ఫీజులు పెంచొద్దు.. ప్రైవేటు పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక

ts-government-permits-to-open-all-shops-in-hyderabad-except-shopping-malls
- Advertisement -

హైదరాబాద్: ఫీజుల విషయంలో ప్రైవేటు పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఫీజులు పెంచొద్దని విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు జీవో 46 ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అందులో కరోనా వైరస్ నేపథ్యంలో ఫీజుల పెంచరాదని తెలిపింది. అదనపు ఫీజులు కాకుండా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని సూచించింది. నెలవారీ ఫీజు మాత్రమే వసూలు చేయాలని తెలిపింది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన రెండు పాఠశాలలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు హైదరాబాద్ డీఈవో వెంకట నరసమ్మ తెలిపారు.

- Advertisement -

ఫీజులు కట్టిన వారికే కాకుండా మిగిలిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పాలన్నారు. ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాతే క్లాస్‌లు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు వేధిస్తే తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకురావాలని నరసమ్మ సూచించారు.

- Advertisement -