తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్!

- Advertisement -

హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఇప్పుడు తాజాగా

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా సోకినట్లు తెలిసింది. ఆయన కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ఆయనకు

- Advertisement -

చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయనలో కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో శనివారం రాత్రి కరోనా టెస్టులు చేశారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ ఫలితం వచ్చిందని తెలుస్తోంది. అయితే దీనిపై మహమూద్

అలీగానీ, ప్రభుత్వ అధికారులుగానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.

- Advertisement -