డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. హోమ్ క్వారంటైన్‌లోకి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత…

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెలరేగిపోతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ దాని బారినపడుతున్నారు.

డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలను కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టలేదు.

- Advertisement -

తాజాగా, నిజామాబాద్ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత డ్రైవర్‌కు కూడా కరోనా సోకింది.

వ్యక్తిగత డ్రైవర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో 50 వేల మార్కును దాటేసింది.

అలాగే, ఇప్పటి వరకు 447 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇంకా 11,052 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

- Advertisement -