కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. కాంగ్రెస్ నేతల మూర్ఖత్వం పరాకాష్టకు చేరింది: మంత్రి జగదీశ్ రెడ్డి

- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యుత్ పంపిణీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తున్నామని, రైతు బంధు, రైతు బీమా ఇవ్వడం కాంగ్రెస్ నేతలకు కలలో కూడా సాధ్యం కాదని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని, ఉత్తమ్ రెడ్డి గ్యాంగ్ మాటలు వింటుంటే వారి బానిస మనస్తత్వం ఏమిటో బయటపడుతోందని అన్నారు.

రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసే పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్న జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాయంలోని పెండింగు ప్రాజెక్టులను తాము పూర్తిచేశామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు తమ వైపే ఉన్నారన్న మంత్రి.. పాత సచివాలయ శిథిలాల్లో కూర్చోవాల్సిన అవసరం తమకు లేదని, కొత్త సచివాలయం నిర్మిస్తామని చెప్పామని, ఇప్పుడు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -