చెప్పినట్లే..: ఎట్టకేలకు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన రాజాసింగ్

- Advertisement -

raja singh

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శనివారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు.

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉంటానని, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ముందు తాను ప్రమాణం చేయనని రాజాసింగ్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే
గురువారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్ హాజరు కాలేదు.

అందరినీ కలుపుకుని వెళ్లాలి: రాజా సింగ్

ఆయనతోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా వివిధ కారణాలతో హాజరు కాలేదు. కాగా, శనివారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం మీడియా సమావేశంలో రాజాసింగ్‌ మాట్లాడారు.

ఎంఐఎం పార్టీ నాయకులు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని, సీఎం కేసీఆర్‌ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌ను చేసినందుకు ఆలోచించాలన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే అందరినీ కలుపుకొని వెళ్లాలని కేసీఆర్‌కు రాజాసింగ్ సూచించారు.

- Advertisement -