లాఠీ పట్టి.. రోడ్లపై తిరుగుతున్న జనం పనిపట్టిన తెలంగాణ మంత్రి

5 days ago

మహబూబ్‌నగర్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా ప్రజలు మాత్రం పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. పని ఉన్నా, లేకున్నా రోడ్లపైకి వస్తూ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. 

పోలీసులను మోహరించినా పట్టించుకోవడం లేదు. దీంతో వారిని నిలువరించేందుకు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా లాఠీ పట్టుకుని రోడ్లపైకి వచ్చేవారి పనిపట్టారు.

లాఠీ చేతపట్టిన ఆయన రోడ్లపై తిరుగుతూ ఇళ్లలోనే ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు. వచ్చే పోయే వాహనాలను ఎక్కడికక్కడ ఆపుతూ కరోనా వైరస్‌పై అవగాహన కలిగిస్తున్నారు.

ఆయనతో పాటు అధికారులు, పోలీసులు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.