తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు ఆమోస్ కన్నుమూత

6:52 am, Fri, 11 October 19

హైదరాబాద్: తొలితరం తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌, మల్కాజిగిరిలోని తన నివాసంలో కన్నుమూశారు.

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆయన కీలకంగా పనిచేశారు. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఆయన జైలుకు కూడా వెళ్లివచ్చారు. అప్పటి సర్కార్ ఆయనను డిస్మిస్ కూడా చేసింది.

తెలంగాణ కోసం ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన తొలి ఉద్యమనేత ఆమోసే. టీఎన్‌జీవో అధ్యక్షుడిగానూ ఆమోస్ పనిచేశారు. ఆయన మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు.