టెన్త్ పరీక్షలు 16 నుంచి, త్వరలోనే వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లు…

1:24 pm, Mon, 11 March 19
ssc-exams, newsxpress.online

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 3వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కొన్ని పరీక్షలు మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి.

ఈ నేపథ్యంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు, నామినల్ రోల్స్‌ను ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌ https://www.bsetelangana.org లో త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు తమ పాఠశాల కోడ్, పాస్‌వర్డ్ వివరాలతో వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మార్చి 22న ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనుండడంతో ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పేపర్-2 పరీక్షను ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించనున్నారు.   పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్..

ఆంధ్రప్రదేశ్‌లో ఇలా…

ఇక ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సంబంధిత అధికారులు హాల్ టిక్కెట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో కూడా ఏప్రిల్ 2వ తేదీతో పదో తరగతి పరీక్షలు ముగియాల్సి ఉంది. అయితే మార్చి 22న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పేపర్-1 పరీక్షను ఏప్రిల్3న నిర్వహిస్తున్నారు.