విషాదం: కరోనా మహమ్మారికి బలైన మూడు నెలల పసికందు

- Advertisement -

ముదిగొండ: ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. మూడు నెలల పసికందు కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు.

జిల్లాలోని ముదిగొండకు చెందని చిన్నారి మెదడు, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండడంతో ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో చూపించారు.

- Advertisement -

అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు.

చిన్నారికి నిర్వహించిన కోవిడ్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు నిన్న రాగా బాబుకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాబు కరోనాతో కన్నుమూయడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

 

- Advertisement -