తారస్థాయికి ‘టిక్‌టాక్’ పిచ్చి.. పోలీసుల మధ్యలో దూరి మహిళ డ్యాన్స్

1:05 pm, Fri, 13 September 19

హైదరాబాద్: పిల్లా పెద్దా తేడా లేకుండా టిక్‌టాక్ పిచ్చి రోజురోజుకూ మరింత ముదిరిపోతోంది. పరిసరాలు, పరిస్థితులతో పనిలేకుండా ఎక్కడపడితే అక్కడే టిక్ టాక్ చేసేస్తున్నారు.

ఓ మహిళా వినాయక నిమజ్జన వేడుకలను తన టిక్‌టాక్ వీడియోకు వేదికగా చేసుకుంది. ఓవైపు హైదరాబాద్‌ పోలీసులు వినాయక నిమజ్జన హడావుడిలో బిజీగా ఉంటే కాప్రా చెరువు సమీపంలో ఓ మహిళ పోలీసుల ముందు నిలబడి టిక్‌టాక్ వీడియోకు పోజిచ్చింది.

‘చందమామ కన్నుకొట్టే’ అని పాటపాడుతూ పోలీసులతో కలిసి టిక్‌టాక్ చేసింది. అటూ ఇటూ పోలీసులు నిలబడి ఉంటే వాళ్ల మధ్యలోకి వెళ్లి డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.

https://www.facebook.com/watch/?v=1478960662243300