తెలంగాణలో నేడు 206 కరోనా కేసుల నమోదు.. 10 మంది మృతి

10:08 pm, Sat, 6 June 20

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. నేడు కొత్తగా 206  పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 3,496కు పెరిగింది. నేడు జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 152 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

అలాగే, రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 123 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 1,710 మంది డిశ్చార్జ్‌ కాగా 1,663 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌‌లో 18, నిర్మల్‌ 5, యాదాద్రి 5, మహబూబ్‌నగర్‌లో 4 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు జగిత్యాల, నాగర్‌కర్నూల్‌లో రెండేసి కేసులు నమోదు కాగా, మహబూబాబాద్‌, వికారాబాద్‌, జనగాం, గద్వాల, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌, మంచిర్యాలలో ఒక్కో కరోనా కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.