హనుమజ్జయంతి శోభాయాత్ర సందర్భంగా నేడు హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు!

10:29 am, Fri, 19 April 19
hanumanjayanthi
హైదరాబాద్‌ : హనుమజ్జయంతి, శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారుల్లో ప్రయాణించాలని సూచించారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ట్రాఫిక్‌ మళ్లింపు, రూట్‌లు తెలుసుకోవచ్చన్నారు. శోభాయాత్ర సాగే రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ర్యాలీలు వివిధ ప్రాంతాలను దాటిన తర్వాత ఆయా రహదారుల్లో ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.
 • అఫ్జల్‌గంజ్‌ నుంచి శంషేర్‌ శేర్‌ హోటల్‌ మీదుగా పుత్లీబౌలికి వెళ్లే వాహనాలను గౌలిగూడ చమన్‌ నుంచి బీఎ్‌సఎన్‌ఎల్‌ కార్యాలయం లేదా సీబీఎస్‌ వైపు మళ్లిస్తారు.
 • ఆంధ్రాబ్యాంక్‌, రంగ్‌మహల్‌ నుంచి గౌలిగూడ చమన్‌ వైపు వెళ్లే వారిని పుత్లీబౌలి క్రాస్‌రోడ్‌ వరకే అనుమతిస్తారు.
 • శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత చాదర్‌ఘాట్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి పుత్లీబౌలి క్రాస్‌రోడ్‌ వరకు వచ్చే వాహనాలను రంగ్‌మహల్‌ వై జంక్షన్‌ నుంచి సీబీఎస్‌ వైపు అనుమతిస్తారు.
 • పుత్లీబౌలి దాటి ఆంధ్రాబ్యాంకు వైపు వెళుతున్న సమయంలో జీపీఓ నుంచి కోఠి వైపు వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్‌ వైపు మళ్లిస్తారు.
 • ఆంధ్రాబ్యాంకు చేరుకున్న తర్వాత చాదర్‌ఘాట్‌ నుంచి ఆంధ్రాబ్యాంక్‌ వైపు వచ్చే వాహనాలను ర్యాలీ వెళ్లే రూట్‌కు ఇబ్బంది లేకుండా డీఎంహెచ్‌ఎస్‌, సుల్తాన్‌బజార్‌ క్రాస్‌రోడ్‌ వైపు అనుమతిస్తారు.
 • శోభాయాత్ర కాచిగూడ క్రాస్‌రోడ్‌ చేరే సమయంలో కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి క్రాస్‌రోడ్‌ వైపు వచ్చే వాహనాలను బడీచౌడి, బర్కత్‌పురా వైపు మళ్లిస్తారు.
 • ర్యాలీ రాంకోఠి చౌరస్తా చేరే సమయంలో బర్కత్‌పుర చమన్‌ నుంచి వైఎంసీఏ వైపు వెళ్లే వాహనాలను క్రౌన్‌కేఫ్‌, కాచిగూడ క్రాస్‌రోడ్‌ వైపు మళ్లిస్తారు.
 • వైఎంసీఏ క్రాస్‌రోడ్‌ దాటిన తర్వాత అజామాబాద్‌ నుంచి ట్రాఫిక్‌ను వీఎస్టీ క్రాస్‌రోడ్‌, క్రౌన్‌కేఫ్‌ వైపు మళ్లిస్తారు.

హనుమాన్‌ శోభాయాత్ర నారాయణగూడ చౌరస్తా చేరిన తర్వాత ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను రాంనగర్‌ టి జంక్షన్‌, మెట్రోకేఫ్‌ వైపు మళ్లిస్తారు. హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ నుంచి నారాయణగూడ వైపు వెళ్లే వారిని హెచ్‌పీ పెట్రోల్‌ పంపు నుంచి నారాయణగూడ ఫ్లై ఓవర్‌ పై నుంచి మళ్లిస్తారు. ఫ్లైఓవర్‌ కింది నుంచి ట్రాఫిక్‌ను అనుమతించరు.

 • కింగ్‌కోఠి నుంచి వైంఎసీఏ వైపు వెళ్లే వారు ఈడెన్‌ గార్డెన్స్‌ వైపు వెళ్లాలి.
 • శోభాయాత్ర బాకారం బ్రిడ్జి వద్దకు చేరిన తర్వాత కర్బలా మైదాన్‌ నుంచి కవాడిగూడ వెళ్లే వారు సెయిలింగ్‌ క్లబ్‌ టి జంక్షన్‌ నుంచి చిల్డ్రన్‌ పార్కు వైపు వెళ్లాలి. అదే సమయంలో లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.
 • యాత్ర బాకారం బ్రిడ్జి వద్దకు చేరిన తర్వాత ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్‌ నుంచి కవాడిగూడ వైపు వెళ్లే వాహనాలను ప్రాగా టూల్స్‌ నుంచి గాంధీనగర్‌ వైపు మళ్లిస్తారు.

ర్యాలీ బాలాజీ టిఫిన్‌ సెంటర్‌ వద్దకు చేరిన సమయంలో కింగ్‌కోఠి నుంచి వెళ్లే ట్రాఫిక్‌ను బొగ్గుల కుంట క్రాస్‌రోడ్‌ నుంచి బాటా క్రాస్‌రోడ్‌ వైపు మళ్లిస్తారు.

 • శోభాయాత్ర చిక్కడపల్లి సుధా హోటల్‌ వద్దకు చేరిన తర్వాత ఇక్బాల్‌ మినార్‌ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు వెళ్లే వాహనాలను అంబేద్కర్‌ విగ్రహం వైపు మళ్లిస్తారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను మూసివేస్తారు. అదే సమయంలో ఇందిరాపార్కు నుంచి అశోక్‌నగర్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను గగన్‌మహల్‌ లేదా బండమైసమ్మ వైపు మళ్లిస్తారు.
 • ర్యాలీ ఆర్పీ రోడ్డు చేరిన తర్వాత కర్బలా మైదాన్‌ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రాణీగంజ్‌, ఎంజీ రోడ్‌ వైపు మళ్లిస్తారు. అడవయ్య క్రాస్‌రోడ్‌ వైపు అనుమతించరు.
 • ట్యాంక్‌బండ్‌ నుంచి బైబిల్‌ హౌస్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను కర్బలా మైదాన్‌ నుంచి రాణీగంజ్‌, మినిస్టర్‌ రోడ్‌ వైపు మళ్లిస్తారు.
 • టివోలి క్రాస్‌రోడ్‌ నుంచి బాలమ్‌రాయి వైపు వెళ్లే వాహనాలను ఎన్‌సీసీ క్రాస్‌ రోడ్‌ వద్ద నుంచి బాలంరాయి వైపు మళ్లిస్తారు.
 • ఎన్‌సీసీ క్రాస్‌రోడ్‌ నుంచి డైమండ్‌ పాయింట్‌ వైపు వెళ్లే వారు నార్నే ఎస్టేట్‌ పాయింట్‌ నుంచి కార్ఖానా బస్తీ వైపు వెళ్లాలి.
 • సీటీఓ క్రాస్‌ రోడ్‌ నుంచి బాలంరాయి వైపు వెళ్లే వాహనాలను లీ రాయల్‌ ప్యాలెస్‌ నుంచి బ్రూక్‌బాండ్‌ క్రాస్‌రోడ్‌, ఇంపీరియల్‌ గార్డ్డెన్‌, మస్తాన్‌కేఫ్‌ నుంచి బాలంరాయి వైపు అనుమతిస్తారు.

ఎన్‌సీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి డైమండ్‌ పాయింట్‌ వైపు వెళ్లే వాహనాలను కార్ఖానా బస్తీ నుంచి నార్నే ఎస్టేట్‌ పాయింట్‌ వైపు అనుమతిస్తారు.

 • బాపూజీనగర్‌ నుంచి తాడ్‌బంద్‌ వైపు వెళ్లే వాహనాలను సెంటర్‌ పాయింట్‌ నుంచి డైమండ్‌పాయింట్‌, కార్ఖానా వైపు మళ్లిస్తారు.
 • మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనదారులను సేఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి బాపూజీనగర్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ వైపు అనుమతిస్తారు.
 • బాలానగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను బోయిన్‌పల్లి క్రాస్‌రోడ్‌ నుంచి బాపూజీనగర్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ వైపు మళ్లిస్తారు.