ఇంటర్‌ ఫలితాలపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటి నివేదిక!

12:45 pm, Sat, 27 April 19
inter borad result

హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాలపై 15 అంశాలతో కూడిన నివేదికను త్రిసభ్య కమిటి ప్రభుత్వానికి సమర్పించింది. ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా ఏజెన్సీ తప్పిదాలను కూడా త్రిసభ్య కమిటి గుర్తించింది. ఇంటర్‌ మార్కుల్లో అవకతవకలపై అయిదు రోజులుగా త్రిసభ్య కమిటి విచారణ చేపట్టింది. ప్రధానంగా కొన్ని అంశాలనే ప్రస్తావించి, ఇంటర్‌ బోర్డు అధికారుల తప్పిదాలను ఎత్తి చూపినట్టు సమాచారం.

గ్లోబరీనా ఏజెన్సీకి అర్హత లేకపోయినా, టెండర్‌ తక్కువ కోడ్‌ చేసిన కారణంగా టెండర్‌ ఇచ్చినట్లుగా కమిటి తేల్చింది. దీనిపై ఏలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై కమిటి నివేదికలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి పలు సూచనలు కూడా కమిటి చేసినట్టు సమాచారం.

12 పేజీల నివేదికతో పాటు మరో 15 అనుబంధ అంశాలపై 150 పేజీల నివేదికను అందజేసినట్టు సమాచారం. ఎక్కడెక్కడ ఎలాంటి పొరపాట్లు జరిగాయి. తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఏం చేయాలి. అనే దానిపై పూర్తి నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం.