అభిమానులతో కలిసి తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సెల్ఫీలు.. మంత్రి కడియం చోరీ!

1:42 pm, Fri, 14 February 20

మహబూబ్‌నగర్: అభిమానులతో కలిసి సెల్ఫీ దిగిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన చేతి బంగారు కడియాన్ని పోగొట్టుకున్నారు.

మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. స్థానికంగా జరిగిన ఓ వివాహానికి హాజరైన మంత్రిని చూసిన అభిమానులు సెల్ఫీల కోసం క్యూకట్టారు.

వారిని నిరాశపరచడం ఇష్టంలేని మంత్రి వారితో ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత చూసుకుంటే ఆయన చేతికి ఉండాల్సిన బంగారం కడియం మాయమైంది. దీంతో విస్తుపోవడం మంత్రిగారిపనైంది.

విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కడియం మంత్రికి సెంటిమెంట్ కావడంతో ఎవరైనా తీసి ఉంటే ఇచ్చేయాలని పోలీసులు బతిమాలుకోవడం కనిపించింది.