మరికాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు..

9:24 am, Mon, 13 May 19
-ts-ssc-results

హైదరాబాద్: తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డీ బ్లాక్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in, http;//results.cgg.gov.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచారు అధికారులు.

అలాగే స్కూళ్లకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు చూసుకోవడానికి వీలుగా ప్రతి స్కూల్‌కు ఒక లాగిన్ ఇవ్వనున్నారు. అయితే దీంతో పాటు పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్ద ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ఈ యాప్‌ద్వారా క్షణాల్లో పరీక్ష ఫలితాలను చూసుకోవచ్చు.

ఈ మేరకు విద్యార్థుల సౌకర్యం కోసం విద్యాశాఖ TSSSCBOARD యాప్ ను అభివృద్ధి చేసింది. దీనికి చేయాల్సిందిల్లా ఒక్కటే. విద్యార్థులు, టీచర్లు ఆండ్రాయిడ్ ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం రూల్‌నంబర్, పుట్టిన తేదీ టైప్‌చేసి లాగిన్ కావచ్చని విద్యాశాఖ పేర్కొన్నది. విజయవంతంగా లాగిన్ అయినవారి వివరాలు ఆటోమెటిక్‌గా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయని తెలిపింది. దీంతో ఇంట్లో కూర్చునే విద్యార్థులు తమ ఫలితాలను ఈజీగా తెలుసుకునే సౌకర్యం కల్పించింది విద్యాశాఖ.