ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!

8:26 am, Sun, 21 April 19
pasana has ot a dadasaheb phalke award

హైదరాబాద్: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారం అందుకున్నారు. ‘ఈ ఏటి మేటి పరోపకారి’గా ఉపాసనను ఎంపిక చేశారు. తన అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం లభించింది.

ఈ ఏటి మేటి పరోపకారి…

దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. భిన్నరంగాలకు చెందిన ప్రతిభావంతులకు, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డు అందిస్తున్నారు.

తనకు ఈ అవార్డు రావడం పట్ల ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు అంటూ ఆమె ట్వీట్ చేశారు.