సంచలనం: రెండ్రోజుల్లో కాంగ్రెస్‌లోకి.. టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

utham kumar reddy says trs important leaders join to congress in two days
- Advertisement -

utham kumar reddy says trs important leaders join to congress in two days

హైదరాబాద్: రాబోయే ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్‌ నుండి కొందరు ముఖ్య నేతలు తమ పార్టీలో చేరుతారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి శుక్రవారమే ఇద్దరు నేతలు చేరాల్సి ఉందన్నారు. కానీ కొన్ని కారణాలతో వారి చేరిక వాయిదా పడిందని తెలియజేశారు.

- Advertisement -

శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ…ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ పాలనపై చాలామంది టీఆర్ఎస్ నేతలు విసిగిపోయారని చెప్పారు. కేసీఆర్ తీరుతో మనస్సు విసిగిన టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడబోతున్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారిగా తెలంగాణకు వస్తున్నందున పౌరసన్మానం చేస్తున్నట్టు ఉత్తమ్ చెప్పారు.

క్షమాపణ చెప్పి ఆ తరువాత చేయండి ప్రచారం…

తెలంగాణ బిల్లులో రైల్వే కోచ్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే బీజేపీ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని ఆయన వ్యాఖ్యానించారు. జనం దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ పాలనకు బొందపెట్టే సమయం వచ్చిందన్నారు.

కేసీఆర్‌ వర్సెస్ తెలంగాణ ప్రజలు…

ప్రస్తుత ఎన్నికలు కేసీఆర్‌ వర్సెస్ తెలంగాణ ప్రజలు అని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ ప్రకటించిన కేసీఆర్‌కు ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయస్థాయి సర్వేలు కూడ తెలంగాణలో తమ కూటమి అధికారంలోకి వస్తోందని ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

తమ కూటమికి పీపుల్స్ ఫ్రంట్‌గా పేరు పెట్టినట్టు చెప్పారు. పీపుల్స్ ప్రంట్ డిసెంబర్ 12వ తేదీన అధికారంలోకి వస్తోందని ఉత్తమ్ ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు వెళ్లడం ఖాయం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

చదవండి: వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. వెక్కి వెక్కి ఏడ్చిన మహిళలు…!

- Advertisement -