కేసీఆర్ యూపీఏకి మద్ధతు: జగ్గారెడ్డి వ్యాఖ్యలపై విజయశాంతి అసహనం

10:19 am, Wed, 8 May 19

హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, యూపీఏకి అన్నీ పార్టీ మద్ధతిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అన్నీ కుదిరితే కేసీఆర్,జగన్‌లు కూడా యూపీఏకి మద్ధతిస్తారని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

చదవండివైసీపీ నేతలు కాలకేయులు లాంటి వాళ్ళు: వల్లభనేని వంశీ

కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్‌తో చావో, రేవో అనేలా పోరాడుతోందని అన్నారు. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని  చెప్పారు.

ఇక యూపీఏలో టీఆర్ఎస్ చేరబోతోందని చెబితే.. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్‌కు ఓటేయడం మంచిదని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. పైగా కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కూడా ఏదో ఉందని ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు.

అసలు టీఆర్ఎస్, వైసీపీ మద్దతు లేకుండా కేంద్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి విశ్వసిస్తున్నట్టు అనిపిస్తోందని విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు.

చదవండిసంచలనం: చంద్రబాబు, కేసీఆర్, జగన్‌ యూపీఏకే మద్ధతిస్తారట….