ఫేస్‌బుక్‌లో యవరైతు ఆవేదన.. నేరుగా ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

12:14 pm, Thu, 28 March 19
Telangana Latest News, TRS Latest News, KCR Latest News, Newsxpressonline

హైదరాబాద్: తన సమస్య పరిష్కారం కోసం 11 నెలలుగా పోరాడుతున్నా ఫలితం లేకుండా పోయిందంటూ ఫేస్‌బుక్‌ ద్వారా తన గోడు చెప్పుకుని బాధపడిన ఓ యువరైతుకు తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ చేసి ఆశ్చర్యపరిచారు.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన శరత్ తనకున్న ఏడెకరాల భూమిని ఇతరుల పేరిట వీఆర్వో కరుణాకర్ పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై 11 నెలలుగా పోరాడుతున్నానని అయితే, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు.

రైతుల ఎంత వేదన అనుభవిస్తున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరే వరకు ఈ వీడియోను షేర్ చేయాలంటూ గోడు వెళ్లబోసుకున్నాడు. సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఈ వీడియో ఎట్టకేలకు కేసీఆర్ దృష్టిలో పడింది.

రైతు గోడును అర్థం చేసుకున్న కేసీఆర్ నేరుగా శరత్‌కు ఫోన్ చేసి సమస్య గురించి తెలుసుకున్నారు. సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్ హోళికేరికి ఫోన్ చేసి శరత్ సమస్య తెలుసుకుని పరిష్కరించాల్సిందిగా కోరారు. సీఎం ఆదేశాలతో ఆగమేఘాల మీద కదిలిన కలెక్టర్ శతర్ ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

అప్పటికప్పుడు విచారణ చేపట్టి ఆర్ఐ పెద్దిరాజు, వీఆర్వో కరుణాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతరుల పేరటి పట్టా చేసిన శరత్ భూమిని తిరిగి అతడి పేరిట పట్టా చేసేందుకు చర్యలు ప్రారంభించారు.

చదవండి:కాంగ్రెస్ ఆనందం ఆవిరి: గెలిచిన జీవన్, గులాబీ గూటికి మరో ఎమ్మెల్యే