కడుపు నొప్పితో వచ్చిన వ్యక్తి మూత్రాశయంలో అది చూసి.. డాక్టర్లు షాక్‌

10:36 pm, Fri, 5 June 20
doctors-found-charging-cable-in-urinary-bladder

దిస్‌పూర్: ‘’నా 25 ఏళ్ల  అనుభవంలో  కొన్ని కేసులు చూసినప్పుడు షాక్ అవుతుంటాను. కానీ ఈ కేసు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది..’’ అని ఓ సీనియర్ డాక్టర్ చెప్పాడంటే ఆ కేసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఎవరైనా ఏదైనా మింగితే అది కడుపులోకి వెళ్లాలి. పేగుల్లోనో, జీర్ణాశయంలోనో ఉండాలి. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఓ వస్తువు విచిత్రంగా మూత్రాశయంలోకి చేరింది.

చదవండి: ఇంట్లోనే మద్యం తయారు చేసుకోవడం ఎలా?: గూగుల్‌లో.. తెగ వెతికేసిన మందుబాబులు!

వివరాల్లోకి వెళితే.. అనుకోకుండా ఇయర్‌ఫోన్స్ మింగేశానని, కడుపులో భరించలేనంత నొప్పిగా ఉందంటూ అస్సాంలో ఓ 30 ఏళ్ల వ్యక్తి స్థానిక ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే అక్కడి డాక్టర్లు అతడిని పరీక్షించారు.

ఎండోస్కోపీ, లాబోరేటరీ టెస్టులు వంటి అన్ని రకాల పరీక్షలూ చేశారు. అయినా ఎక్కడా ఏమీ కనపడలేదు. దీంతో అక్కడి సీనియర్ డాక్టర్ వాలీ ఇస్లాంకు అనుమానం వచ్చి అతడికి ఎక్స్‌-రే తీయించారు.

వచ్చిన రిపోర్టులు చూసిన డాక్టర్లంతా షాక్ అయ్యారు. దీనికి కారణం అతడి యూరినరీ బ్లాడర్(మూత్రాశయం)లో చుట్టలు చుట్టుకుని ఉన్న ఓ కేబుల్ కనపడటమే.

ఆ కేబుల్ అక్కడకు ఎలా వెళ్లిందో డాక్టర్లకి అర్థం కాలేదు. కొంతసేపు ఆలోచించిన తరువాత కారణం తెెలుసుకున్నారు. అదే విషయాన్ని బాధితుడిని అడగగా అతడు ఒప్పుకోలేదు. అయిన్పటికీ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇస్లాం ఆ కేబుల్‌ని బయటకు తీశారు.

ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలను, ఆపరేషన్ చేసి కేబుల్‌ను బయటకు తీసిన వీడియోను ఇస్లాం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 

చదవండి: ‘‘చేతులెత్తి మొక్కుతాం.. కర్రతో కొట్టకురా.. కాళ్లు కూడా మొక్కుతాం.. కనికరించి వదలరా..’’

‘ఈ కేబుల్ అక్కడకు ఎలా వెళ్లిందో అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇతడే ఆ కేబుల్‌ను తన పురుషాంగం ద్వారా జొప్పించుకున్నాడు. మా వద్దకు వచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ఇది చూసిన నాకు అతడి మానసిక స్థితిపైనే అనుమానం కలుగుతోంది. సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అతడు కోలుకుంటున్నాడు’ అని రాసుకొచ్చారు.

అంతేకాదు, ఈ భూమ్మీద ఏదైనా జరుగవచ్చని, దానికి ఇలాంటి ఘటనలు ఓ తార్కాణం అని ఇస్లాం చెప్పుకొచ్చారు.