గూగుల్‌లో ‘Thanos’ అని టైప్ చేసి.. ఏం జరుగుతుందో చూడండి!

5:35 pm, Fri, 26 April 19
Avengers end Game Latest News, Thanos Latest News, Hollywood Movie News, Newsxpressonline

హైదరాబాద్: మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ సెర్చ్ ఆప్షన్ ఉందా? మీరు కంప్యూటర్ దగ్గర ఉన్నారా? గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి అందులో Thanos అని టైప్ చేయండి. వచ్చిన సెర్చ్ రిజల్ట్స్‌లో కుడివైపు ఉండే చేతి ఆకారంలో ఉంటే గాంట్లెట్‌ను క్లిక్ చేయండి. ఏం జరుగుతుందో చూడండి.

ఏం జరుగుతుందో చూస్తే మీరు షాకవ్వాల్సిందే. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోతాయి. ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా ప్రమోషన్ కోసం గూగుల్ చేసిన మ్యాజిక్ ఇది. ఇప్పుడు ప్రపంచమంతా ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా గురించే చర్చ. ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.

‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమాలో Thanos ఓ పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్. అవెంజర్స్‌తో ఢీకొట్టిన విలన్. ఆ బలవంతుడే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌ని చిటికెలా మాయం చేస్తాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా గూగుల్ రూపొందించిన ఈ సెర్చ్ టెక్నిక్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఈ విషయం తెలుసుకున్నవాళ్లంతా గూగుల్‌లో Thanos అని టైప్ చేసి సెర్చ్ రిజల్ట్స్ ఎలా మాయమవుతున్నాయో చూస్తున్నారు. మాయమైన సెర్చ్ రిజల్ట్స్‌ని మళ్లీ రప్పించడానికి చేతి ఆకారంలో ఉంటే గాంట్లెట్‌ను మరోసారి క్లిక్ చేస్తే చాలు.

చదవండి:  ప్రపంచ సినీ చరిత్రలో ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్ కొత్త రికార్డ్ సృష్టిస్తుందా?